ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

Sep 16 2025 8:01 AM | Updated on Sep 16 2025 8:01 AM

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

అనకాపల్లి: చట్ట పరిధిలో సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు వచ్చాయని, భూతగాదాలు–23, కుటుంబ కలహాలు–4, మోసాలకు సంబంధించినవి–3, వివిధ విభాగాలకు సంబంధించినవి–10 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పూర్తి విచారణ చేసి, పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు, ఎస్‌ఐ వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement