
పింఛన్ ఇప్పించండమ్మా..
భర్త చనిపోయి పిల్లలపై ఆధారపడి జీవిస్తున్న తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు బొగాది మహాలక్ష్మి వేడుకుంది. కుమారుడి సహాయంతో కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేసింది. భర్త చనిపోయిన మహిళలకు ఇటీవల ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసినప్పటికీ తనకు ఇవ్వలేదని, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాపోయింది. పింఛన్ ఇప్పించాలని ఎస్‌డీసీ సుబ్బలక్ష్మిని వేడుకుంది.
–వృద్ధురాలు బొగాది మహాలక్ష్మి