
బ్రాండిక్స్‌లో 580 మందికి కంటి పరీక్షలు
అచ్యుతాపురం: స్థానిక బ్రాండిక్స్‌లో ఆదివారం నిర్వహించిన 142వ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 580 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 450 మందికి బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరైస్వామి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. మరో 140 మందికి మందులు పంపిణీ చేశారు. 57 మందికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ కాటరాక్ట్ సర్జరీ అవసరమైన వారిని తమ వాహనాల్లో విశాఖకు తీసుకెళ్లి, అక్కడ శస్త్రచికిత్స తర్వాత వారి స్వగృహాలకు చేరుస్తామని తెలిపారు. వైద్య పరీక్షలకు హాజరైన వారికి మజ్జిగ, ఫలహారం, భోజన సదుపాయాలు కల్పించారు.