
వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలి
వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ రమేష్, సిబ్బంది
నర్సీపట్నం: వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని టౌన్ ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేశారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీ నం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. సుమా రు 50 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదన్నారు.