
ఆచార్యులుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
నక్కపల్లి: మండలంలో పెదబోదిగల్లం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎన్.వి.ఎస్. ఆచార్యులు మాస్టర్‌ను ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర శాఖ గుంటూరులో ఆదివారం ఘనంగా సన్మానించి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేసింది. ఈ నెల 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కారం అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తున్న బ్రాహ్మణ ఉపాధ్యాయులకు ఈ పురస్కారాలను అందజేస్తున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతికి చెందిన ఎస్.ఆర్. కృష్ణమూర్తి, నాగార్జున విశ్వవిద్యాలయం సంస్కృత విభాగానికి చెందిన డాక్టర్ మంజుల చింతలపాటి, కౌతా ధర్మసంస్థల అధినేత కౌతా సుబ్బారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకుడు విష్ణువర్దన్, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మంగళంపల్లి అంజిబాబు, బందా రవి, రామభద్రుడు, కాణిపాకం ఆలయ అర్చక పురోహిత సంఘం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి అయ్యన్న పాల్గొన్నారు. 15 ఏళ్లుగా ఆచార్యులు మాస్టర్ విద్యార్థుల్లో విద్యాప్రమాణాల మెరుగుకు, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సెలవు రోజుల్లో గ్రామాల్లో పర్యటించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
ఘన ంగా సన్మానం