
కళ్లు తెరవండి.. నిజం చెప్పండి
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్...ఫేస్ వాష్’
డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
రాత్రి వేళల్లో నిద్ర మత్తులో తరచూ రోడ్డు ప్రమాదాలు
జిల్లాలో జాతీయ రహదారిపై 9 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఇసుక డ్రమ్ముల ఏర్పాటు
మొబైల్ టీమ్‌లతో అర్థరాత్రి వేళల్లో డ్రైవర్లకు ఫేస్ వాష్
ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల..
ఇది కల కాదు.. నిజమే! అనకాపల్లి జిల్లావాసులతోపాటు సరిహద్దులోని పాడేరు నియోజకవర్గంలో కొన్ని మారుమూల గ్రామాల గిరిజనులకు ఉపయోగపడే విధంగా గత వైఎస్సార్‌సీపీ తలపెట్టిన బృహత్ కార్యక్రమమిది.. విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన దార్శనికుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలల ప్రాజెక్టు ఇది. అందమైన కల కనడమే కాదు.. 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించేందుకు 2022 డిసెంబరు 30న శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో సగానికి పైగా దాదాపు 60 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. బోధనాస్పత్రి భవనంలో మూడు అంతస్తులు సిద్ధమయ్యాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల భవనంలో రెండు అంతస్తులు పూర్తయ్యాయి. అదే వేగంతో నిర్మాణం జరిగితే కొద్ది నెలల్లోనే మొత్తం భవనాలు అందుబాటులోకి వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం కుటిల బుద్ధితో పనులు నిలిపివేసింది. 15 నెలల కాలంలో అడుగు నిర్మాణం కూడా చేపట్టకపోగా.. ఆ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కి అప్పగించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు జీవో కూడా విడుదల చేసింది. పైగా నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఉన్నాయంటూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. అందుకే వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం కళాశాల భవనాలను పరిశీలించారు. రుజువులు, సాక్ష్యాలతో వాస్తవ పరిస్థితిని బయటపెట్టారు.
సాక్షి, అనకాపల్లి:
ఉత్తరాంధ్ర ప్రాంతంలో 1921 సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత ఇదే ప్రాంతంలో అనకాపల్లి, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడేరు మెడికల్ కళాశాల పూర్తి కావడంతో తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. మాకవరపాలెం మండలంలోని కళాశాల భవనాలు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేవి. జిల్లాలో గల ఆరు నియోజకవర్గాల ప్రజలకు, పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి, కొయ్యూరు పరిసర ప్రాంత గిరిజన ప్రజలకు మేలు జరిగేది. కళాశాల ప్రారంభమైతే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. తర్వాత పీజీ వైద్య కోర్సులు రావడానికి అవకాశం ఏర్పడేది. కూటమి సర్కారు ప్రైవేటు దాహంతో ఇవన్నీ తీరని కలలా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.
వైఎస్సార్‌సీపీ బృందం సందర్శన
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులు భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం సందర్శించారు. భవనాలు సగానికి పైగా పూర్తయ్యాయని, కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి నిర్మాణాలు అక్కడ నిలిపివేయడం దారుణమన్నారు. ప్రజల యోగ క్షేమాలను పరిగణనలోకి తీసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియడం లేదంటూ విమర్శించారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయడాన్ని అంగీకరించబోమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కలిసివచ్చే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పార్టీ ముఖ్యనేతలు రుత్తల ఎర్రాపాత్రుడు, బోని శివరామకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కె.రామకృష్ణ, ఎంపీపీలు రుత్తల సర్వేశ్వరరావు, మణికుమారి, సుర్ల రాజేశ్వరి, సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీలు అప్పలనర్స, సుర్ల వెంకట గిరిబాబు, మాకవరపాలెం, గొలుగొండ, నర్సీపట్నం రూరల్, నాతవరం మండల పార్టీ అధ్యక్షులు చిటికెల రమణ, కొరుప్రోలు ఫాణి తాంఽథారామ్, సానాపతి వెంకటరత్నం, నాగేశ్వరావు, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం మాస్టర్ ప్లాన్‌పై చర్చ
నర్సీపట్నం: నూతనంగా రూపొందించిన ము న్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌పై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించా రు. 2040 నాటికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్టు వీఎంఆర్‌డీఏ ప్లానింగ్ ఆఫీసర్ అ రుణవల్లి పేర్కొన్నారు. పట్టణంలో ఇంటర్నల్ రోడ్లతోపాటు ప్రధాన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. అబిద్ సెంటర్ నుంచి పెదబొడ్డేపల్లి, అబిద్ నుంచి చింతపల్లి, అబిద్ నుంచి కె.డి.పేట రోడ్డు వంద అడుగులకు విస్తరించాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. దీనిపై పలువురు వ్యాపారస్తులు వారి అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ జంపా సురేంద్ర పాల్గొన్నారు.
సాక్షి, అనకాపల్లి :
జాతీయ రహదారిపై సుదూర ప్రయాణం చేసే వాహనదారులు రాత్రి వేళ అలసటతో నిద్రలోకి జారుకోవడం కారణంగా తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళల్లో నిద్రలేమి కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు, జిల్లా జాతీయ రహదారులపై ఉన్న 9 హైవే మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పరిధి జాతీయ రహదారి–16 పై లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు 80 కిలోమీటర్ల మేర తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను 9 బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించారు. ప్రతి 7 నుంచి 14 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక్కో పాయింట్లో ఒక మొబైల్ టీమ్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్ టీమ్‌లో ఒక డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్ లేదా ఏఎస్‌ఐ ఉంటారు. వీరికి ఫస్ట్ ఎయిడ్‌తో పాటు ఫేస్ వాష్ కూడా శిక్షణ ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు నడిపే డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, లైటింగ్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తున్నారు.
జాతీయ రహదారులపై ప్రమాదాలు...
చైన్నె–కోల్‌కతా నేషనల్ హైవే మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైవేకు ఇరువైపులా గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా పరవాడలో ఫార్మా కంపెనీల నుంచి షిప్ట్‌ల వారీగా కార్మికులు హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమయంలో రాత్రి వేళ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల నిద్రమత్తు వల్లే జరుగుతున్నట్టు గుర్తించారు.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అర్ధరాత్రి 12 తరువాత తెల్లవారుజామున 4 గంటలలోపు అత్యధికంగా ప్రమాదాలు జరిగాయి. జిల్లా పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం నేషనల్ హైవేపైనే జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో వాహనం నడిపేటప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే వాహనాన్ని అపేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని చెబుతున్నారు.
మొబైల్ టీంలు ఇలా..
అనకాపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ ఎస్.రమేష్ పర్యవేక్షణలో మొబైల్ టీంలను దిశానిర్దేశం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా హైవేలో అనకాపల్లి (కొప్పాక–కశింకోట జంక్షన్), కశింకోట జంక్షన్–ఎనీపాలెం, యలమంచిలి (ఎనీజీపాలెం–రేగుపాలెం), యలమంచిలి (రేగుపాలెం–ధర్మవరం), ఎస్.రాయవరం, నక్కపల్లి (ఉపమాక జంక్షన్– ఉద్దండపురం), పాయకరావుపేట (ఉద్దండపురం–తాండవా జంక్షన్),సబ్బవరం (చిన్నయ్యపాలెం–మర్రిపాలెం) 7 కి.మీలు, పరవాడ (క్యాన్సర్ ఆస్పత్రి–కొప్పాక జంక్షన్)లో మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం 60 శాతం పూర్తి కావడం నిజం కాదా? 50 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవన సముదాయం నిర్మించడం నిజం కాదా? అందుకు రూ.500 కోట్లు మంజూరు చేయడం నిజం కాదా? పేద ప్రజలకు ఎంతో మేలు చేసే వైద్య కళాశాల, బోధనాస్పత్రులను ప్రైవేటుపరం చేయాలన్న మీ కుట్ర నిజం కాదా? నిజ నిర్ధారణ కోసం పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుల సూటి ప్రశ్నలివి..

కళ్లు తెరవండి.. నిజం చెప్పండి

కళ్లు తెరవండి.. నిజం చెప్పండి