
‘విజయ పథం’లో కేజీబీవీలు
కశింకోట/ఎస్.రాయవరం: విజయ పథకం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల కార్యదర్శి దేవానందరెడ్డి ఆదేశించారు. కశింకోట మండలంలోని తేగాడ కేజీబీవీ, ఎస్.రాయవరం మండలంలోని తిమ్మాపురం కేజీబీవీలను గురువారం ఆయన సందర్శించారు. విజ యపథం కార్యక్రమం, విద్యా ప్రమాణా లు, రికార్డులు, విద్యార్థుల నోట్ పుస్తకాలు, స్లిప్‌టెస్ట్ మూల్యాంకనాలను పరిశీలించారు. టెన్త్, ఇంటర్మీడియట్‌లో శత శాతం ఉత్తీర్ణత సాధన కు పలు సూచనలిచ్చారు. తేగాడలో విద్యార్థులతో సహ పంక్తి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ డి.చంద్రకళ, ఏజీసీడీవో సబియా సుల్తానా, వృత్తి విద్యా సమన్వయకర్త శ్రీలత, జిల్లా జీసీడీవో ఏఎస్‌డీ జెమిమ పాల్గొన్నారు. తిమ్మాపురంలో పాఠశాల భవన నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు.