రాజకీయ పార్టీల నాయకుల స్టేట్‌మెంట్లు పత్రికలో పబ్లిష్ చేస్తే రిపోర్టర్లు, ఎడిటర్‌పై కేసులు పెడతారా..? రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. ప్రజల పక్షాన గళమెత్తుతున్న ’సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాయిండర్ ఇవ్వాలి. కానీ పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఇలాంటి సంస్కృతికి బీజం నాటడం భవిష్యత్తులో నిజాన్ని అణగదొక్కినట్లే అవుతుంది. – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం
ప్రెస్‌మీట్ కవర్ చేస్తే కేసులు పెడతారా..!