
పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై వేధింపులకు పాల్పడుతోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్‌పై కేసు పెడతారా? మీడియా గొంతును నులిమేస్తారా? రాష్ట్రంలో ప్రతికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షలు కార్పణ్యాలతో పత్రిక ఎడిటర్‌పై కేసుల నమోదు ఏమాత్రం సరికాదు. రాష్ట్రంలో కూటమి
ప్రభుత్వానికి డబ్బా కొట్టే పచ్చ మీడియా మాత్రమే ఉండాలా? మీ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపించే
ఏ మీడియా ఉండకూడదా.. అయినా మీకెందుకంత ఉలికిపాటు. – గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి