
19 పీఎస్‌లకు డ్రోన్ కెమెరాలు
కె.కోటపాడు : జిల్లాలో 19 పోలీస్‌స్టేషన్‌లకు సీఎస్‌ఆర్ నిధులతో డ్రోన్ కెమెరాలను అందించినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌ను గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు ఈ ఏడాది పోలీస్‌స్టేషన్‌లో నమోలైన కేసుల వివరాలను ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై నిఘాతో పాటు చోరీ ఘటనల్లో నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ నిఘా వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అలాగే గంజాయి రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చెక్‌పోస్టు వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సేవనం, బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం వంటి వాటిపై 112కు సమాచారం అందించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, కూడలిలో ట్రాఫిక్ ఇబ్బందులను చక్కదిద్దడానికి ఎస్పీ తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్, చీడికాడ, దేవరాపల్లి ఎస్‌ఐలు బి.సతీష్, సత్యనారాయణ పాల్గొన్నారు.