
ఎస్సీ వర్గీకరణతో దళితల ఐక్యతపై కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న రత్నాకర్
నర్సీపట్నం: దళితల ఐక్యతను దెబ్బతీసేందకే ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చినట్టు నేషనల్ ప్రిసెసెంట్ ఫర్ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. ఆయన శనివారం నర్సీపట్నంలో మాట్లాడారు. దేశంలో ఎస్సీలో 1108 కులాలుండగా వాటి మధ్య చిచ్చురేపేందుకు ఎస్సీ వర్గీకరణ చేయడం కోసం మోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మాలలు అంతా ఐక్యంగా పోరాటాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రేమ్‌బాబు, కుండ్రు కల్యాణ్, నెల్లి సూరిబాబు,నాని పాల్గొన్నారు.