
పేరంటపల్లి శివాలయం వద్ద స్వామివారి దర్శనానికి వెళుతున్న పర్యాటకులు
వీఆర్‌పురం: క్రిస్మస్ సెలవులతో పాపికొండలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సోమవారం పోచవరం బోటు పాయింట్‌కు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. మిచాంగ్ తుపాను ప్రభావంతో 20 రోజుల పాటు అధికారుల ఆదేశాల మేరకు బోటింగ్‌ను నిలిపివేశారు. కాగా గత వారం అధికారులు తిరిగి అనుమతినిచ్చారు. అయినా పర్యాట కులు అంతంతమాత్రంగానే ఉన్నారు. ఆది, సోమ వారాలు సెలవు కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 14 బోట్లలో వెయ్యిమందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వెళ్లినట్టు ఏపీటూరిజం కౌంటర్ అసిస్టెంట్ సీహెచ్.రాజేష్ తెలిపారు.పర్యాటకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో బోటింగ్ పాయింట్ ,పేరంటాలపల్లి శివాలయం ప్రాంతాలు కళకళలాడాయి.