
తాటాకిల్లు దగ్ధం
మాకవరపాలెం: మండలంలోని జి.కోడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ తాటాకిల్లు దగ్ధమైంది. గ్రామంలోని దళితవాడలో నివాసం ఉంటున్న ఉలంపర్తి అప్పయ్యమ్మ, బాబూరావులకు చెందిన ఇల్లు శుక్రవారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటిలోపల ఉన్న ధాన్యం, వెండి, బంగారు వస్తువులు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దగ్ధమైన ఇంటిని తహసీల్దార్ వెంకటరమణ పరిశీలించారు. ఆయన, గ్రామస్తులు కలిసి బాధితులకు గ్యాస్ సిలిండర్, స్టవ్, రూ.20 వేల నగదు, దుస్తులు, 50 కిలోల బియ్యం అందజేశారు.

తాటాకిల్లు దగ్ధం