తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): డివిజనల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం దొండపర్తిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో అధికార భాషా సమావేశం నిర్వహించారు. గత త్రైమాసికంలో కమిటీ చేపట్టిన వివిధ ప్రధాన పనుల నిమిత్తం చర్చించారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్ ప్రచురిస్తున్న విశాఖ వాణి హిందీ మ్యాగజైన్‌ను డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విభాగంలోని అధికారులు అధికారిక భాషా విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయా విభాగాల్లో హిందీ భాషపై పనిచేయడంలో, టైప్‌లో శిక్షణ పొందిన ఉద్యోగులు తప్పకుండా వాటిని ఆచరణలో పెట్టాలన్నారు. మరింత మంది ఉద్యోగులను హిందీ పోటీలు, వర్క్‌షాప్‌ల్లో పాల్గొనేలా ప్రేరేపించాలని చెప్పారు. విశాఖ వాణి పత్రికలో ఆర్టికల్స్ రాసిన ఉద్యోగులు, అధికారులను డీఆర్‌ఎం అభినందించారు.


