8 మంది హోంగార్డులపై క్రమశిక్షణా చర్యలు! | - | Sakshi
Sakshi News home page

8 మంది హోంగార్డులపై క్రమశిక్షణా చర్యలు!

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

ఆరిలోవ: అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 8 మంది హోంగార్డులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశంపై నగరంలోని కై లాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ కార్యాలయంలో బుధవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా సమావేశం నిర్వహించారు. ఇందులో హోంగార్డుల కమిటీ చైర్మన్‌ హోదాలో ఎస్పీతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం వంటి కారణాల వల్ల 8 మంది హోంగార్డులపై నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించారు. కొద్ది రోజుల్లోనే వీరిపై తుది చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ తీర్మానించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు విశాఖ రీజియన్‌ హోంగార్డు కమాండెంట్‌ ఎ.జోషి, డీఎస్పీ ఎ.రాఘవేంద్రరావు, ఏఆర్‌ డీఎస్పీ కె.రవికుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

అనకాపల్లి ఎస్పీ తుహిన్‌ సిన్హా సమావేశంలో కమిటీ తీర్మానం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement