పాడేరు రూరల్: పట్టణంలోని తలారిసింగి బాలుర పాఠశాల మైదానంలో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈటోర్నిలో సుమారు 40 జట్లు తలపడ్డాయి. ప్రథమ స్థానం హకుంపేట. ద్వితీయస్థానం పాడేరు మండలం చీడిమెట్ట జట్లు సాధించాయి. వీటికి అమ్మవారి జాతర ముగింపు రోజు ఈనెల 19న నగదు బహుమతులు అందజేస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. మహేష్, కృష్ణ, పీడీలు మహేష్‌బాబు, మన్మథరావు, సింహాచలం, వినోద్ పాల్గొన్నారు.


