జి.మాడుగులలో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

జి.మాడుగులలో భారీ వర్షం

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదుర గాలులు, పిడుగులతో భారీ వర్సం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. జి.మాడుగుల– లంబసింగి జాతీయ రహదారి మార్గంలో మట్టిరోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

డుంబ్రిగుడ: డుంబ్రిగుడలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురవడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. వర్షం వల్ల వేరుశనగ, అల్లం పైరుకు మేలు చేకూరుతుందని రైతులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement