భక్తులకు మజ్జిగ,మంచినీరు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

భక్తులకు మజ్జిగ,మంచినీరు పంపిణీ

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

పాడేరు రూరల్‌: మోదకొండమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా గిరి కై లాస క్షేత్రం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవాలయ ఆధ్యాత్మిక సేవా బృందం ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరి కై లాస క్షేత్రం ఆలయ చైర్మన్‌, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, డాక్టర్‌ నర్సింగరావు దంపతులు హాజరై పంపిణీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... దైవ మార్గంతోనే మానసిక ప్రశాంతత, ముక్తి కలుగుతాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గిరి కై లాస క్షేత్ర ధర్మకర్తల మండలి సభ్యురాలు రమాదేవి, ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, నిర్వాహకులు రామారావు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement