శివపురంలో బంగారు ఆభరణాలు చోరీ | - | Sakshi
Sakshi News home page

శివపురంలో బంగారు ఆభరణాలు చోరీ

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో నివాసం ఉంటున్న మద్దికొండ సిరిల్‌పాల్‌ ఇంట్లో ఈ నెల 15వ తేదీ రాత్రి చోరీ జరిగినట్టు టౌన్‌ సీఐ ఎస్‌.కె.గఫూర్‌ తెలిపారు. సిరిల్‌పాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎవరైనా ఇతర ఊళ్లకు వెళ్లే సమయంలో తమ విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను బ్యాంక్‌ లాకర్‌లో భద్రపరుచుకోవాలని, లేదా తమ వెంట తీసుకువెళ్లాలని సీఐ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement