రెండు లారీలు ఢీ | - | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

మాకవరపాలెం: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున తాళ్లపాలెంవైపు నుంచి రాచపల్లి వద్దగల పయినీర్‌ కంపెనీకి బొగ్గులోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమదంలో బొగ్గులారీ డ్రైవర్‌ గాయపడడంతో వెంటనే విశాఖ తరలించినట్టు స్థానికులు తెలిపారు. బొగ్గు లారీ ముందు భాగం బాగా దెబ్బతినడంతో సాయంత్రం వరకు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం స్థానిక పోలీసులు దగ్గరుండి లారీని పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రైవర్‌కు గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement