పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని అన్ని వర్గాల ప్రజలు, భక్తులు నిర్ణయించారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల భద్రత కారణాలను సాకుగా చూపిస్తూ, భక్తుల మనోభావాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాల తేదీలను ఈనెల 17, 18, 19 తేదీలకు మార్చింది. ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
భక్తుల కోసం 100 ప్రత్యేక బస్సులు..
ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు
ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు పాడేరు నుంచి వివిధ మార్గాల్లో సుమారు 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తెలిపారు. రోజువారీ సర్వీసులు యథావిధిగా సాగుతూనే.. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయన్నారు.
మద్యం దుకాణాలు మూసివేత
జాతర ఉత్సవాలు ముగిసే వరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు పట్టణంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
పాడేరులో మూడు రోజులు నిర్వహణ


