రామనామం జపిస్తున్న భక్తులు
జి.మాడుగుల: చింతపల్లి మండలం కృష్ణాపురంలోని శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమంలో జరుగుతున్న అఖండ రామనామ జప యజ్ఞానికి మద్దతుగా.. జి.మాడుగులలో శ్రీరామ ఆలయ సన్నిధిలో సోమవారం 24 గంటల అఖండ రామనామ జప యజ్ఞం ప్రారంభమైంది. శ్రీ పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం ఆధ్వర్యంలో భక్తులంతా ఏకమై శ్రీరామ జయరామ జయ జయ రామ నామ జపాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ అఖండ రామనామ స్మరణ మంగళవారం ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు సాగుతుందని వెల్లడించారు. లోకకల్యాణార్థం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరామాలయం పూజారి నాగేశ్వరరావు, శ్రీ మత్స్య మాడుగులమ్మ ఆలయం పూజారి సన్యాసిరావు, పాకలపాటి గురుదేవుల భక్త బృందం సభ్యులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


