ముత్యాలమ్మతల్లి హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

ముత్యాలమ్మతల్లి హుండీ ఆదాయం లెక్కింపు

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న కమిటీ సభ్యులు

చింతపల్లి: స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలవిరాట్‌ హుండీ ఆదాయం రూ. 68,600 వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల 14వ నుంచి 17 వరకు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జాతర సందర్భంగా భక్తులు హుండీలో వేసిన విరాళాలను శనివారం కమిటీ పెద్దల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సుర్ల అప్పారావు, సుర్ల వీరేంద్ర, కమిటీ సభ్యులు మాదల తిరుపతి, పెదిరెడ్ల బేతాళుడు, మాజీ వైస్‌ సర్పంచ్‌లు గంజారి రమణ, బండారు అప్పలనాయుడు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement