మా వీధిలో అన్నీ సమస్యలే | - | Sakshi
Sakshi News home page

మా వీధిలో అన్నీ సమస్యలే

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

మా వీధిలో అన్నీ సమస్యలే ప్రబలుతున్నాయి. సక్రమంగా తాగునీరు అందడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్సలు లేదు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

– కె.జ్యోతి, బక్కలపనుకు, పాడేరు

పేరుకే జిల్లా కేంద్రం

జిల్లా కేంద్రంలో అన్ని రకాల సమస్యలు పేరుకుపోయాయి. మా వీధిలో ఎప్పటి నుంచో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. మురుగునీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు మరింత ప్రబలుతున్నాయి.

– బొండ కనకరత్నం, సుండ్రుపుట్టు, పాడేరు

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగిస్తాం. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

– రమేష్‌, ఈవో (ప్రత్యేకాధికారి), పాడేరు

Advertisement
 
Advertisement
Advertisement