వీధిలైట్లు పంపిణీ చేస్తున్న ఎంపీపీ తదితరులు
కొయ్యూరు: అరకు ఎంపీ తనూజరాణి ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన వీధిలైట్లను శుక్రవారం ఎంపీపీ బడుగు రమేష్, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు,డౌనూరు ఎంపీటీసీ బి. అప్పారావు పంపిణీ చేశారు. మండలానికి వీధిలైట్లు కేటాయించడంపై వారంతా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. మండలానికి మరిన్ని నిధులను కేటాయించాలని వారు ఎంపీని కోరారు. కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు కంటి వైద్య శిబిరం
పెదబయలు: మండలంలోని గోమంగి పీహెచ్‌సీలో ఈ నెల 16 తేదీన కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారి చైతన్య తెలిపారు.ఈ శిబిరాన్ని విజయనగరం పుష్పగిరి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. దృష్టిలోపం ఉన్న వారు శిబిరానికి హాజరు కావాలని కోరారు.అవసరమైన వారికి శస్త్ర చికిత్స చేసేందుకు రిఫర్ చేస్తామన్నారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


