బైక్‌ల దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ల దొంగ అరెస్టు

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

రూ.12.70 లక్షల గంజాయి స్వాధీనం

నాతవరం: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. రోడ్డుపై పలు కార్యాలయాలు, దుకాణాలు వద్ద నిలిపి ఉంచిన వాహనాలు చోరీకి గురైనట్టు చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇటీవల తాండవ జంక్షన్‌లో జరిగిన చోరీ కేసులో అనుమానితులపై ప్రత్యేంగా నిఘా పెట్టామన్నారు. శుక్రవారం వల్సంపేట జంక్షన్‌లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆ సమయంలో వచ్చిన నిందితుడు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన కె.దుర్గాప్రసాద్‌ను పట్టుకుని, చోరీ చేసిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించాలమని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన మైత్రి బృందానికి ఎస్‌ఐ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement