కానరాని పర్యాటక సందడి | - | Sakshi
Sakshi News home page

కానరాని పర్యాటక సందడి

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

అరకులోయ టౌన్‌: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకులోని పర్యాటక ప్రాంతాలన్నీ గత కొన్ని రోజులుగా పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.ఈ పరిస్థితికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యాటకుల రాకపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పర్యాటక రంగంపై కనిపిస్తోంది.రవాణా ఖర్చులు పెరగడం, ఇంధన కొరత కూడా పర్యాటకులు తగ్గడానికి ఒక కారణమని పర్యాటక ప్రాంతాల్లో నిర్వాహఖులు భావిస్తున్నారు.

వీకెండ్‌లో అంతంత మాత్రంగా..

సాధారణ రోజుల్లో పర్యాటకుల తాకిడి అసలు కనిపించడం లేదని, కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని స్థానిక వ్యాపారులు, పర్యాటక కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యాటక రంగంపై ఆధారపడిన స్థానిక గిరిజనులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గణనీయంగా తగ్గిన సందర్శకుల సంఖ్య

Advertisement
 
Advertisement
Advertisement