జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

● పీటీ ఎన్‌డీపీఎస్‌ చట్టం అమలు

అనకాపల్లి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్‌తో అడుకుంటున్న నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్‌ సిన్హా గురవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం అసాంఘిక కార్యక్రలాపాలకర పాల్పడుతున్న, గంజాయి స్మగ్లర్‌పై ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఉత్తర్హులు మేరకు పీటీ ఎన్‌డీపీఎస్‌ యాక్టును ప్రయోగించి జైలుకు తరలించడం జరుగుతుందన్నారు. రోలుగుంట మండలం, బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన చిన్నికృష్ణ(35) కొంతకాలంగా వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడుతున్నాడని, ఇతనిపై జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లో ఐదుకు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ సమాజానికి ముప్పుగా మారిన చిన్ని కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని, దీనిపై పరిశీలించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈనెల 11న పీటీ యాక్టు అమలు చేయాలని ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్‌ఐ పి.రామకృష్ణారావు చిన్నికృష్ణను అదుపులోనికి తీసుకుని, విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించడం జరిగిందన్నారు. ఈ చట్టం కింద అరెస్టుయిన వ్యక్తికి ఏడాది వరకూ బెయిల్‌ వచ్చే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సాదారణ సెక్షన్లతో పాటు పీటీ యాక్ట్‌ నమోదు చేయడం జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement