–నానేపల్లి మాణిక్యం
నక్కపల్లి స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూమిలో వారసత్వంగా వచ్చిన భూమిని నా సోదరులు నాకు తెలియకుండా ఇతరులకు విక్రయించేసారని, విచారణ చేసి న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతుందని నక్కపల్లి మండలం దోణివాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన నానేపల్లి మాణిక్యం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. వారసత్వ హక్కుగా తనకు వాటాగా వచ్చే భూమిపై నష్టపరిహారం పొందేలా అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని ప్రాథేయపడినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, భూముల్లో జరుగుతున్న రీసర్వే ఆపుతానని చెప్పిన నక్కపల్లి ఎమ్మార్వో కూడా ఇప్పుడు దాటవేస్తున్నారని, తన వద్ద భూ భూమి కాగితాలు లాక్కుని తిరిగి ఇవ్వకుండా నానా బాధలు పెడుతున్నారని వాపోయాడు.


