రూ. 10 లక్షల ఆస్తి నష్టం
రావికమతం: మండలంలోని టి.అర్జాపురం సమీపంలో సోమవారం పదెకరాల సరుగుడు తోట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతులు మడగల శ్రీను, మరిశా హేమంత్ కుమార్, మరిశా అప్పారావు, బాలరాజు, అప్పలకొండ, అద్దిపల్లి రాము, మడగల అప్పారావు, కంఠం రెడ్డి వెంకటరమణ, ఉల్గింగల రాములకు చెందిన పదెకరాల సరుగుడు తోట కాలి బూడిదైంది. దీని నష్టం విలువ రూ. 10 లక్షల ఉంటుందని అంచనా. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియదని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు.


