పాండవుల చెరువు ఆక్రమణలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

పాండవుల చెరువు ఆక్రమణలు తొలగించాలి

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

మాడుగుల రూరల్‌: మాడుగుల పాండవుల చెరువు ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.టి. దొర డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ఇక్కడ చెరువును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మాడుగుల మోదమాంబ ఆలయం సమీపంలో సర్వే నంబరు 258లో 11 ఎకరాల 60 సెంట్లు చెరువు గర్భం కలిగిన పాండవుల చెరువులో సగ భాగం ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి నాయకులు కోట్లాది రూపాయల విలువ చేసే చెరువును కబ్జా చేసి, దాని నుంచి తప్పించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మానస సరోవరం పేరు తో నాబార్డు నిధులు రూ. 50 లక్షలతో కొంత మేర అభివృద్ధి చేయడానికి చూస్తున్నారని ఆరో పించారు. దీనిపై సోమవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమస్యకు సంబంధించి తహసీల్దారు, అధికారులు జోక్యం చేసుకోవా లన్నారు. సమస్యను పరిష్కరించకపోతే స్థానికులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement