అంబేడ్కర్‌ విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

అనకాపల్లి: స్థానిక గవరపాలెం అంబేడ్కర్‌ నగర్‌లో ఈనెల 25న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దండ జ్ఞానదీప్‌, దళిత సంఘాల జిల్లా నాయకుడు ఎస్‌.నూకరాజు సోమవారం పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఎడమ నేత్రాన్ని శనివారం రాత్రి సుమారుగా 11.30 నుంచి 2 గంటల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, దోషుల్ని తక్షణమే అరెస్టుచేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement