నాతవరం: ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న వర్కుఇన్‌స్పెక్టర్ల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు తాండవ డివిజన్ పరిధిలో గల కోటనందూరు సెక్షన్ కార్యాలయంలో సోమవారం జరిగాయి. రాష్ట్ర అద్యక్షుడు పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి, జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.వి.నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎస్.అప్పారావు, ఉపాధ్యక్షులుగా కె.బంగ్రారాజు, కె.సూరి అప్పారావు, కార్యదర్శిగా బి.సత్యనారాయణ, ఇతర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ఎస్.సుబ్బరాజు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సంఘం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.


