ఎస్పీ కార్యాలయానికి 54 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయానికి 54 అర్జీలు

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 54 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నా రు. భూ సమస్యలు, చీటింగ్‌, ఆర్థిక నేరాలు, ఉద్యోగుల పేరుతో మోసాలు, అధిక వడ్డీ ఆశచూపి నగదు కాజేయడం, ఆన్‌లైన్‌ మోసాలకు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులకు సంబంధించిన అర్జీ లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement