మరో ఇద్దరికి గాయాలు
నక్కపల్లి: కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే నక్కపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు మహిళా కూలీలు సోమవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్తున్నా రు. జాతీయ రహ దారి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న వీరిని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్దా సత్యవతి (45)కి తీవ్ర గాయాలై నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. చిన్న నూకమ్మ, ఏనుగుపల్లి సత్యవతిలకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. బాధితులను వైస్ ఎంపీపీ వీసం నానాజీ, టీడీపీ ఇన్‌చార్జి వెంకటేష్, కోసూరు శ్రీను, శంకర్, వీసంరాజు తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళి తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న నూకమ్మ,
ఏనుగుపల్లి సత్యవతి


