టీడబ్ల్యూ ఈఈ డేవిడ్ రాజు
కొయ్యూరు: రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక పార్కు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ డేవిడ్ రాజు తెలిపారు. జేఈ శ్రీవిద్యతో కలిసి రాజేంద్రపాలెంలో అల్లూరి పార్కును ఆయన సోమవారం సందర్శించారు అల్లూరి విగ్రహం ఉన్న భవనాన్ని, మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించారు.పర్యాటలను ఆకర్షించే విధంగా పార్కు అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు.అనంతరం ఆయన కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల–1లో నిర్మిస్తున్న భవనాన్ని, సిబ్బంది క్వార్టర్ల పనులను పరిశీలించారు.కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు.


