ఏబీఎన్‌ రాధాకృష్ణను అరెస్టు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణను అరెస్టు చేయాలి

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

ఎస్పీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,మత్స్యలింగం,జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు పరిశీలకులు సత్యారావు,పార్టీ నేతలు

అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎమ్మెల్యేభాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ అరకు పరిశీలకుడు సత్యారావు,పార్టీ నేతలు

సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబాలతో పాటు రాష్ట్రంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కించపరిచేటట్టు తప్పుడు రాతలు రాసిన ఏబీఎన్‌,ఆంఽధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్‌ చేశారు.రాధాకృష్ణపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు అరెస్టు చేయకపోవడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు నిరసించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీచైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ అరకు పరిశీలకులు ఏడువాక సత్యారావు,పాడేరు,అరకు నియోజకవర్గాల నేతలతో కలిసి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేసి, ఏబీఎన్‌ రాధకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబాలు,మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారంతా ఏఎస్పీకి వివరించారు.ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాధాకృష్ణ మహిళల పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాధాకృష్ణను ఈకేసుల నుంచి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని చెప్పారు. ఈ నెల 9న వైఎస్సార్‌సీపీ నేతలు పాడేరు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.

ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,అరకు పరిశీలకులు ఏడువాక సత్యారావు మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు,మహిళలు ఆందోళనలు చేసి, ఫిర్యాదులు చేసినా పట్టనట్టు వ్యవహరించడం పోలీసుశాఖకు తగదన్నారు. ప్రభుత్వానికి,టీడీపీ నేతలు,వారి అనుకూల శక్తులకు తలొగ్గి పోలీస్‌ శాఖ పనిచేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనంతగిరి ఎంపీపీ తెడబారికి మిఽథుల,అరకులోయ వైస్‌ ఎంపీపీ కిల్లో రామన్న, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ,యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్‌, మహిళా విభాగం పాడేరు అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి,పలు మండలాల అధ్యక్షులు కొర్రా సూర్యనారాయణ,పాంగి పరశురామ్‌,మజ్జి చంద్రుబాబు,పాంగి అనీల్‌కుమార్‌,చింతలవీఽధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి,అనంతగిరి మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి,ఎస్టీసెల్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు కమ్మిడి అశోక్‌,పాడేరు పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, ఎస్టీసెల్‌ అరకులోయ మండల అధ్యక్షుడు పాంగి నగేష్‌,పార్టీ సీనియర్‌ నాయకులు నరసింహమూర్తి,గండేరు చిన సత్యం, కమ్మిడి విజయదశమి,మినుములూరు మాజీ సర్పంచ్‌ మినుముల కన్నాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,

ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement