కలెక్టర్ నిశాంతి హెచ్చరిక
సాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని బంకులను నిరంతరం పర్యవేక్షిస్తామని, పెట్రోలు, డీజిల్ సమృద్ధిగానే ఉన్నాయని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలిసి ఆమె స్థానిక ఐవోసీ ఆయిల్ బంకును సోమవారం తనిఖీ చేశారు.ఆయిల్ నిల్వలపై బంకు నిర్వాహకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోలు,డీజిల్ కొరత లేదన్నారు.జిల్లాలోని 22 బంకులను తనిఖీ చేసేందుకు రెవెన్యూ,పోలీసు,పౌరసరఫరాలు,తూనికలు కొలతల విభాగాలతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇంధన కొరత,ఇతర ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 08935293448కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.కాగా కలెక్టర్ నిశాంతి తనిఖీ చేసిన కొద్ది సేపటికే తలారిసింగి ఐవోసీ బంకులో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి.సాయంత్రం అనంతరం సోమవారం రాత్రి ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.జిల్లాలోని పెట్రోల్,డిజిల్ కొరతపై ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుందని,ఆయిల్ బంక్‌ల నిర్వహకులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు.టాస్క్‌పోర్స్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు.ప్రస్తుతానికి జిల్లాలోని అన్ని బంక్‌లలో 125 కిలోలీటర్ల పెట్రోల్,127కిలోలీటర్ల డిజిల్ నిల్వలు ఉన్నాయన్నారు.


