● వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రణాళిక
● 3వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు
● సెర్స్ అడిషనల్ సీఈవో
శ్రీరాములు నాయుడు
చింతపల్లి: విదేశీ కూరగాయలు పండించే గిరిజన ప్రాంతంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సెర్ఫ్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరాములునాయుడు తెలిపారు. మండలంలోని బలభద్రం,తాజంగి కోరుకొండ,చౌడుపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి మహిళా రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విదేశీ కూరగాయల పంటలకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో గతంలో 150 ఎకరాల్లో పలు రకాలు పంటలు సాగుకు సంబంధించి 3వందల మంది డ్వాక్రా సభ్యులు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో సాగు చేపట్టడానికి 3వేల మంది రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. విదేశీ పంటలైన జుకినీ,బ్రకోలి,కలర్ కాలీఫ్లవర్,చెర్రి టమాటా,సాలరీ కొత్తిమీర,వెక్యూస్ ఆకుకూర,చైనీస్ క్యాబేజీతో పాటు 30 రకాలు పంటల సాగుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ, సెర్ఫ్ లైవ్‌లీ హుడ్ డైరెక్టర్ శ్రీనివాస్,అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్ నాగేశ్వరరావు,ఏపీఎం శ్రీనివాసరావు,వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.


