తల లేని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

తల లేని మృతదేహం లభ్యం

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

అనంతగిరి(అరకులోయటౌన్‌): అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో తల లేని మృతదేహం లభించింది. గోస్తనీ నది ఒడ్డున తుప్పల్లో ఉన్న మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వ్యక్తులు గుర్తించారు.ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. తలను నరికి ఎవరు తీసుకువెళ్లారు?, మరణించిన వ్యక్తి స్థానికుడా? పర్యాటకుడా ? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అరకులోయ సీఐ ఎల్‌.హిమగిరి మాట్లాడుతూ గోస్తనీ నది ఒడ్డున పురుషుడి తల లేని మృదేహం లభించినట్టు చెప్పారు. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య మృతుడి వయస్సు ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 6 అంగులాలు ఉండవచ్చన్నారు. కుడి చేతిపై అమ్మ, నాన్న అనే టాటు ఉందని, శరీరంపై దుస్తులు లేవన్నారు. మృతదేహాన్ని శవపంచనామ కోసం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని, అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ హిమగిరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement