ఘనంగా ముగిసినమారెమ్మ తల్లి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసినమారెమ్మ తల్లి ఉత్సవాలు

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

సీలేరు: మారెమ్మ తల్లి ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి.అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగించి, చల్లనీటి కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. తల్లి గరగను అర్చకులు దామోదర శర్మ, కమిటీ సభ్యులు, మాలలు ధరించిన భవానీల ఆధ్వర్యంలో రిజర్వాయర్‌లో నిమజ్జనం చేశారు. అనంతరం మారెమ్మ మాలాధారణ భక్తులు దీక్ష విరమించారు. మంగళవారం 10 గంటలకు వరకు అమ్మవారి దర్శనాలు కల్పించి, తలుపులను మూసివేస్తారు. బుధవారం ఉదయం ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి అర్చకులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మారు పూజ చేపట్టి మళ్లీ ఉత్సవాలు వరకు యథావిధిగా పూజలు జరుపుతారు.

Advertisement
 
Advertisement
Advertisement