పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పట్టణ ప్రాంతాల్లో దైనందిన జీవితంతో విసుగెత్తిపోయిన ప్రజలు కాస్త ఉపశమనం కోసం ప్రకృతి వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రకృతి మాత ఆహ్వానం పలుకుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, జలజలపారే జలపాతాలు, వేసవిలోనూ ఊరటనిచ్చే చల్లటి గాలులు మన్యం ప్రత్యేకత. ఆ విశేషాలు మీకోసం.
గిరి సోయగం..
ముంచంగిపుట్టు/డుంబ్రిగుడ: మన్యం పేరు వింటేనే అంతులేని ప్రకృతి అందాలు, పచ్చని కొండకోనలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఎటుచూసినా పరవళ్లు తొక్కే జలపాతాలు, నిశ్చలంగా అలరారే జలాశయాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. తూర్పు కనుమల్లో దట్టమైన అడవుల మధ్య సాగే ప్రయాణం, మంచు దుప్పటి కప్పుకున్న కొండలు మనసును మైమరపిస్తాయి. చింతపల్లి నుంచి పాడేరు వరకు, అరకులోయ నుంచి జోలాపుట్టు వరకు ప్రతి అడుగులోనూ ప్రకృతి తన వింతలను పరిచయం చేస్తుంది. కాలుష్యానికి దూరంగా, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ సేదతీరాలనుకునే వారికి ఈ ప్రాంతం ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది.
పరవళ్లు తొక్కుతున్న డుడుమ జలపాతం
జాలువారుతున్న జలపాతాలు
అకట్టుకుంటున్న ప్రకృతి అందాలు
ఎటుచూసినా చల్లని గాలులు
సరికొత్త అనుభూతిని పంచుతున్నపర్యాటక ప్రాంతాలు


