చింతపల్లి: హైదరాబాద్‌లో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పాండు కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని రికార్డు సృష్టించినట్లు చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బాకురు పాండురాజు తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ స్థాయిలో కరాటే ప్రదర్శన జరిగింది. గిన్నీస్ రికార్డు ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో జిల్లా నుంచి ఎం. దీప్తిక (పాడేరు), హర్షిణి (పాడేరు), పి. మేరి (చింతపల్లి), యు. కామేశ్వరరావు (జి. మాడుగుల) పాల్గొన్నారని పాండురాజు వివరించారు. ఈ రికార్డు కార్యక్రమంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు సుమారు రెండు వేల మంది పాల్గొన్నారన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ (లండన్) నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ ప్రదర్శనను పరిశీలించి, రికార్డును ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. గిరిజన ప్రాంతం నుంచి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


