108 అంబులెన్స్‌లోసుఖ ప్రసవం | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్స్‌లోసుఖ ప్రసవం

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

డుంబ్రిగుడ: మండలంలోని గుంటసీమ పంచాయతీ జోగిపుట్టు గ్రామానికి చెందిన కొర్ర బృంద అనే గిరిజన మహిళ ఆదివారం ఉదయం 108 అంబులెన్స్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది ఈఎంటీ అప్పలరాజు, పైలట్‌ శ్యామ్‌సుందర్‌లు వెల్లడించారు. జోగిపుట్టు గ్రామానికి చెందిన బృందకు పురిటి నొప్పులు రావడంతో, ఆమె భర్త రాజబాబు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే గ్రామానికి చేరుకుని, బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది, స్థానిక ఆశా కార్యకర్త సహకారంతో అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాలంలో అండగా నిలిచి, పురుడు పోసిన 108 సిబ్బందిని, ఆశా కార్యకర్తను గిరిజనులు ప్రత్యేకంగా అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement