ఎంపికై న క్రీడాకారులతో పీఈటీలు,అసోసియేషన్ సభ్యులు
మాకవరపాలెం: రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు 32 మంది ఎంపికయ్యారని బేస్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ అక్షజ్‌కృష్ణ తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ మండలాల నుంచి 14 ఏళ్లలోపు వయస్సున్న 70 మంది హాజరయ్యారు. ఎంపిక పోటీల్లో 16 మంది బాలురు, 16 మంది బాలికలు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారంతా వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం శ్రీను, పీఈటీ రవి పాల్గొన్నారు.


