అనకాపల్లి: మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో విజయవాడ –విశాఖ రైల్వేలైన్‌లో గుర్తుతెలియని రైలు ఢీకొని సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతి చెందాడు. స్థానికులు, రైల్వే గ్యాంగ్‌మేన్ ఇచ్చిన సమాచారం మేరకు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిచారు. మృతుడు ఎరుపురంగు హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్, నేవీ బ్లూ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని, ఎడమచేతి బొటనవేలు దగ్గర ఆర్.కె. అనే టాటూ ఉందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. సమాచారం తెలిసిన వారు సెల్‌నంబర్. 7382058996ను సంప్రదించాలని ఎస్‌ఐ చెప్పారు.


