మాది జి.మాడుగుల మండలం మారుమూల గ్రామమైన కులుపాడు. గత రెండు నెలలుగా గ్యాస్ సిలిండర్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. ఐటీడీఏ గ్యాస్ వ్యాన్ మా గ్రామానికి రాకపోవడంతో, పాడేరు ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఫోన్‌లో బుక్ చేశా. సిలిండర్ కోసం ఈ రెండు నెలల కాలంలో మూడుసార్లు ఖాళీ బండతో పాడేరు గ్యాస్ గోడౌన్ చుట్టూ తిరిగా. ఇప్పటికీ ఓటీపీ రాకపోవడంతో గ్యాస్ పొందలేకపోతున్నా. దీనివల్ల జీపు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
– ఉగ్రంగి పద్మ, గిరిజన మహిళ,
కులుపాడు, జి.మాడుగుల మండలం


