గ్యాస్ సిలిండర్ అవసరం నిమిత్తం ఫిబ్రవరి 26వ తేదీన పాడేరు ఏజెన్సీ ద్వారా బుకింగ్ చేశాను. రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఓటీపీ రాకపోవడం దారుణం. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. గిరిజన ప్రాంతాలకు గ్యాస్ లారీలను తక్కువగా పంపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ప్రతి నెల సకాలంలో గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి.
– కొండపల్లి సోమన్నదొర,
వినియోగదారుడు, పాడేరు


