ప్రతి గ్రామంలో శివాలయం ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామంలో శివాలయం ఉండాలి

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

● స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ

మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ

పాయకరావుపేట: గ్రామ పరిధిలో గ్రామ దేవత ఆలయం, గ్రామంలో శివాలయం ఎంతో ముఖ్యమని విశాఖ శారదా పిఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. మండలంలోని కుమారపురం గ్రామంలో కుమార ఉమారామలింగేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సభలో గ్రామ దేవత, శివాలయం ఆలయాల విశిష్టతపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హేచరీస్‌ చైర్మన్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, నాయకులు నీలాపు మహేష్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చిరంజీవిరెడ్డి, వెంకటరెడ్డి పెరుమాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement