చోడవరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం నేడు | - | Sakshi
Sakshi News home page

చోడవరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం నేడు

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

● హాజరు కానున్న బొత్స, కన్నబాబు

● హాజరు కానున్న బొత్స, కన్నబాబు

ప్రారంభానికి సిద్ధమైన చోడవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయం

చోడవరం: వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గం ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. చోడవరం పట్టణానికి అతి సమీపంలో ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నిర్మించారు. పార్టీ కార్యాలయంతోపాటు ఆయన నివాసం ఉండేందుకు సొంతిల్లు కూడా ఇదే ప్రదేశంలో నిర్మించుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అమర్‌నాథ్‌ గృహ ప్రవేశం చేస్తారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నియోజవర్గ కార్యాలయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సమన్వయకర్తలు, పార్టీ పరిశీలకులు, నియోజకవర్గ నాయకులందరూ పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement